Header Banner

యూకే లో మృతిచెందిన గుంటూరు విద్యార్ధి! తీరని విషాదంలో కుటుంబ సభ్యులు! ఆదుకోమని ఎన్నారైలకు అభ్యర్ధన!

  Tue Apr 08, 2025 18:53        Europe, Helping Hand

 

చేతికంది వస్తాడనుకుంటే అనారోగ్యంతో మరణించి మాకు కడుపుకోత మిగిల్చాడు

- ఉన్నత విద్యాభ్యాసం కోసం యూ.కే వెళ్లిన కుమారుడు అనారోగ్యంతో మరణించడంతో కన్నీరుమున్నీరైన తల్లి, చెల్లి, కుటుంబసభ్యులు.
- కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు సహకరించాలని ప్రభుత్వానికి, యూ.కేలోని ఎన్.ఆర్.ఐలకు వేడుకోలు
- సాయి పార్థివదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ముందుకొచ్చిన ప్రవాసాంధ్రులు 

 

తల్లికి మద్ధతుగా ప్రవాసాంధ్రుల చేయూత.. 
ఏప్రిల్ 4వ తారీఖున యూకేలో గుంటూరు కి చెందిన విద్యార్థి అనారోగ్య కారణంగా ఆకస్మికంగా మరణించడం జరిగింది. తండ్రి లేని కారణంగా తల్లి అన్ని తానే అయ్యి ఉన్నత చదువులకు యూకే పంపించారు. ఈ సంఘటనకు స్పందిస్తూ UK లోని ఎన్నారై టిడిపి సభ్యులు దుఃఖంలో మునిగిపోయిన ఆ తల్లికి సహాయాన్ని అందించేందుకు చనిపోయిన తన కొడుకు దేహాన్ని తరలించేందుకు మరియు ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా go fund రైజ్ చేయడం జరిగింది. 

 

సాటి NRI తెలుగువారు, యూకే మరియు యూరప్ లోని దాతలు ముందుకువచ్చి, పుట్టెడు కష్టాల్లో ఉన్న సాయి కుటుంబానికి అండగా నిలవాలని వారు సవినయంగా అభ్యర్థిస్తున్నారు. ఈ go ఫండ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని సాయి మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించి మిగిలిన మొత్తాన్ని అతని కుటుంబానికి అందచేయడం జరుగుతుంది అని వారు తెలిపారు. మానవతా దృక్పథంతో వారికి చేయూత అందించే వారు ఈ కింద లింక్ పై క్లిక్ చేసి వారికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. go fund లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు, చదువులో రాణించి, మంచి ఉద్యోగంలో స్థిరపడి తనను చక్కగా చూసుకుంటాడని నమ్మిన ఆ తల్లికి విధి కడుపుకోత మిగిల్చింది. మాస్టర్స్ చేయడంకోసం యూ.కే వెళ్లిన గుంటూరు యువకుడిని అనారోగ్యం రూపంలో బలితీసుకుంది. పిల్లలు ఎదిగేవయసులో భర్తనుకోల్పోయినా, ధైర్యంగా పిల్లల్ని పెంచి ప్రయోజకులేని చేసిన ఆతల్లి, చేతికి అందివస్తాడనుకున్న బిడ్డ మరణవార్త విని తట్టుకోలేక విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచివేస్తోంది. తన అన్నయ్య ఆశీస్సులతో తన జీవితం బాగుంటుందనుకున్న ఆ చెల్లి, సోదరుడి మరణవార్త విని బోరున విలపిస్తోంది. 

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాకు చెందిన సాయి మణికంఠేశ్ ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్ పై నమ్మకంతో డేటా అనలిటిక్స్ లో మాస్టర్స్ చేయడంకోసం ఫిబ్రవరి 2021న యూ.కేలోని హెర్ట్ ఫోర్డ్ షైర్ విశ్వవిద్యాలయానికి చేరుకున్నాడు. ఉన్నతవిద్యాభ్యాసం పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధించి తనకుటుంబాన్ని బాగా చూసుకోవాలని, సుఖసంతోషాలంతో జీవించాలని అనుకున్నాడు. అందుకు తగినట్టే సహచరులతో పోటీ పడి చదువులో రాణించాడు. అంతా బాగుందనుకున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన బ్రెయిన్ హేమరేజ్ తో అనారోగ్యం పాలయ్యాడు. విపరీతమైన వాంతులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న సాయి మణికంఠేశ్ ను సహచర విద్యార్థులు, యూనివర్శిటీ సిబ్బంది సమీపంలోని ఛారింగ్ క్రాస్ ఆసుపత్రికి తరలించారు.

 

వైద్యులు సాయిని కాపాడటానికి చేసిన శస్త్రచికిత్సలు ఫలించలేదు. దాంతో అతన్ని 2022లో విక్టోరియా కేర్ సెంటర్ కు తరలించారు. ఆనాటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ, మృత్యువుని జయించే క్రమంలో సాయి కొంత కోలుకున్నాడు. తిరిగి తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాలనే ఆశయంతో ఉన్న సాయి అకస్మాత్తుగా ఏప్రిల్ 4, 2025న మరణించడం జరిగింది. సాయి మరణవార్త తెలిసిన సహచరులు, యూనివర్శిటీ ప్రొఫెసర్లు ఎంతగానో బాధపడ్డారు. అతని మరణవార్త తన కుటుంబానికి ఎలా తెలియచేయాలా అని మదనపడ్డారు. తమ కుమారుడు ఇక లేడు అన్న వార్త తెలిసిన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం వారి వల్ల కాలేదు. ఎదిగిన బిడ్డ, జీవితంలో స్థిరపడి తమను బాగా చూసుకుంటాడని ఆశించిన తల్లి, ఇప్పుడు బరువెక్కిన హృదయాలతో కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడం కోసం ప్రభుత్వాన్ని, యూ.కే లో స్థిరపడిన ప్రవాసాంధ్రుల్ని సాయం కోసం అర్థించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GunturYouth #TragicLoss #GermanyNews #NRISupport #TDPNRI #HelpForSai #EmotionalTribute